ఐఎస్‌ఐఎస్ మహిళా ఉగ్రవాది అరెస్టు

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌)లో చేరేందుకు యువతను ప్రేరేపిస్తున్న ఓ మహిళా తీవ్రవాదిని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వివరాలు… అఫ్షా జబీమ్ అలియాస్ నిక్కీ జోసెఫ్ అనే యువతి ఐఎస్‌ఐఎస్‌కు చెందినదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటోంది. బజార్‌ఘాట్‌కు చెందిన మొహియుద్దీన్‌ను ఐఎస్‌ఐఎస్‌లో చేర్పించేందుకు నిక్కీ జోసెఫ్ ప్రేరేపించారు. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు […]

Advertisement
Update: 2015-09-10 13:22 GMT
ఇస్లామిక్‌ స్టేట్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌)లో చేరేందుకు యువతను ప్రేరేపిస్తున్న ఓ మహిళా తీవ్రవాదిని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వివరాలు… అఫ్షా జబీమ్ అలియాస్ నిక్కీ జోసెఫ్ అనే యువతి ఐఎస్‌ఐఎస్‌కు చెందినదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటోంది. బజార్‌ఘాట్‌కు చెందిన మొహియుద్దీన్‌ను ఐఎస్‌ఐఎస్‌లో చేర్పించేందుకు నిక్కీ జోసెఫ్ ప్రేరేపించారు. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళుతున్న మొహియుద్దీన్‌ను గత జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. మొయినుద్దీన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిక్కీ జోసెఫ్‌ను దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రప్పించారు. ఆమె విమానాశ్రయంలోకి రాగానే పోలీసులు అరెస్టు చేశారు.
Tags:    
Advertisement

Similar News