త్వరలో బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం

తెలంగాణలో భవనాల క్రమబద్దీకరణ (బీఆర్‌ఎస్), స్థలాల క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) చేయాలని నిర్ణయించామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రకటించారు. రెండుగంటలపాటు సాగిన మంత్రివర్గం ఉప సంఘం భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవడానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని, ఇపుడు క్రమబద్దీకరిచుకోక పోతే తర్వాత పడే ఇబ్బందులకు ప్రభుత్వం బాధ్యత వహించదని మంత్రి హెచ్చరించారు. క్రమబద్దీకరణ తేదీలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చాక […]

Advertisement
Update: 2015-09-09 05:17 GMT
తెలంగాణలో భవనాల క్రమబద్దీకరణ (బీఆర్‌ఎస్), స్థలాల క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) చేయాలని నిర్ణయించామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రకటించారు. రెండుగంటలపాటు సాగిన మంత్రివర్గం ఉప సంఘం భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవడానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని, ఇపుడు క్రమబద్దీకరిచుకోక పోతే తర్వాత పడే ఇబ్బందులకు ప్రభుత్వం బాధ్యత వహించదని మంత్రి హెచ్చరించారు. క్రమబద్దీకరణ తేదీలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చాక ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతులు 30 రోజుల్లో వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇకపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినచర్యలు తప్పవని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
Tags:    
Advertisement

Similar News