బీహార్‌ ఎన్నికలకు మోగిన నగారా

బీహార్‌ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను ఐదు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ ప్రకటించింది. ఎన్నికలు అక్టోబర్‌ 12న ప్రారంభమై నవంబర్‌ 5న ముగుస్తాయని తెలిపింది. అక్టోబర్‌ 12న తొలి దశ ప్రారంభమవుతుంది. రెండో దశ 16న, మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్‌ 1న, ఐదో దశ ఎన్నికలు నవంబర్‌ 5న జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 6.68 కోట్ల మంది […]

Advertisement
Update: 2015-09-09 03:52 GMT
బీహార్‌ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను ఐదు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ ప్రకటించింది. ఎన్నికలు అక్టోబర్‌ 12న ప్రారంభమై నవంబర్‌ 5న ముగుస్తాయని తెలిపింది. అక్టోబర్‌ 12న తొలి దశ ప్రారంభమవుతుంది. రెండో దశ 16న, మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్‌ 1న, ఐదో దశ ఎన్నికలు నవంబర్‌ 5న జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 6.68 కోట్ల మంది ఓటర్లున్నారని, తమ ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారన్న ఆశాభావాన్ని కమిషన్‌ వ్యక్తం చేసింది. నవంబర్‌ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని కమిషన్‌ తెలిపింది.
Tags:    
Advertisement

Similar News