ముంబై పోలీస్ కమిషనర్ మారియాకు బదిలీ షాక్

సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును ప్రతిష్టాత్మకంగా డీల్ చేస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాకు ఊహించని షాక్ తగిలింది. ఆయన స్థానంలో అహ్మద్ జావిద్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ముంబై పోలీస్ కమిషనర్‌గా ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించారు. అయితే రాకేష్ మారియాకు హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించారు. షీనా బోరా కేసును మారియా డీల్ చేస్తున్న వైనంపై సీఎం ఫడ్నవీస్ గుర్రుగా ఉన్నారు. అలాగే ఐపీఎల్ మాజీ చీఫ్ […]

Advertisement
Update: 2015-09-07 13:16 GMT
సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును ప్రతిష్టాత్మకంగా డీల్ చేస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాకు ఊహించని షాక్ తగిలింది. ఆయన స్థానంలో అహ్మద్ జావిద్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ముంబై పోలీస్ కమిషనర్‌గా ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించారు. అయితే రాకేష్ మారియాకు హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించారు. షీనా బోరా కేసును మారియా డీల్ చేస్తున్న వైనంపై సీఎం ఫడ్నవీస్ గుర్రుగా ఉన్నారు. అలాగే ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీతో లండన్‌లో కొన్నేళ్ల కిందట మారియా సమావేశమైన విషయం రెండు నెలల కిందట వెలుగు చూసింది. దీనిపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన నుంచి వివరణ కోరింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.
Tags:    
Advertisement

Similar News