జగన్‌ ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వం ఆరా?

ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే జగన్‌ ఎన్నిరోజులు నిరాహారంగా ఉండగలడు అనే అంశంపై ఇపుడు తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఏపీ ఇంటలిజెన్స్ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నాయి. ఈ నెల 15వ తేదీలోపు ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించకపోతే నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని జగన్‌ ప్రకటించిన దృష్ట్యా పోలీస్ వర్గాలు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశామని, ఆయన […]

Advertisement
Update: 2015-09-05 19:02 GMT

ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే జగన్‌ ఎన్నిరోజులు నిరాహారంగా ఉండగలడు అనే అంశంపై ఇపుడు తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఏపీ ఇంటలిజెన్స్ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నాయి. ఈ నెల 15వ తేదీలోపు ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించకపోతే నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని జగన్‌ ప్రకటించిన దృష్ట్యా పోలీస్ వర్గాలు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశామని, ఆయన వివరణ సంతృప్తికరంగా లేనందున తాము హోదా కోసం 15 తర్వాత ఏరోజు నుంచి అయినా నిరవధిక నిరాహారదీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 17వ తేదీన వినాయక చవితి ఉన్నందున ఈ పండుగ తర్వాత దీక్షకు ఉపక్రమించాలని జగన్‌కు ఆయన సన్నిహితవర్గాలు సలహా ఇచ్చాయంటున్నారు. దీక్షపై జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ఈ దీక్షతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి జగన్‌‌కు అనుకూలంగా మారుతుందా అని తెలుగుదేశం పార్టీ సతమతమవుతోంది. అందుకే జగన్ శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయమని ఇంటలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. జగన్ దీక్షలో కూర్చుంటే ఎన్నిరోజులు కూర్చోగలడు, అతని శారీరక సహన శక్తి ఎలా ఉంటుంది తదితర వివరాలను ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. జగన్ ఇంతకుముందు 2011లో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై వారంరోజులపాటు నిరాహారదీక్ష చేశారు. అప్పటి వైద్య నివేదికలను కూడా బయటికి తీసి విషయాలను విశ్లేషించాలని అధికారులు భావిస్తున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదాపై జగన్‌ ఢిల్లీలో దీక్ష చేశారు. మొన్న రాష్ట్ర బంద్ నిర్వహించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ప్రత్యేకహోదా విషయంలో ఉద్యమించి తెలుగు ప్రజలకు దగ్గర కావటానికి జగన్‌ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే నిరవధిక దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమే ఇపుడు అధికారపక్షానికి గుబులు పుట్టిస్తోంది.

Click to Read: చంద్రబాబులో దండిగా సైకో లక్షణాలు: అంబటి రాంబాబు

Tags:    
Advertisement

Similar News