ముస్లిం జనాభా నియంత్రణకు శిక్షల అస్త్రం: తొగాడియా

ఇటీవల మతపరమైన జనాభా లెక్కలు విడుదలైన నేపథ్యంలో మరోమారు ముస్లింలపై హిందుత్వ సీనియర్ నేతలు ఇద్దరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభా జిహాద్‌ను నియంత్రించడానికి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కన్న ముస్లింలపై శిక్షలకు ఉపక్రమించాలని వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. దేశ జనాభాలో ముస్లింల వాటా పెరుగుతున్నందున వారికున్న మైనారిటీ హోదాను తొలగించాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కోరారు. అనేక జిల్లాల్లో […]

Advertisement
Update: 2015-09-03 19:32 GMT
ఇటీవల మతపరమైన జనాభా లెక్కలు విడుదలైన నేపథ్యంలో మరోమారు ముస్లింలపై హిందుత్వ సీనియర్ నేతలు ఇద్దరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభా జిహాద్‌ను నియంత్రించడానికి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కన్న ముస్లింలపై శిక్షలకు ఉపక్రమించాలని వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. దేశ జనాభాలో ముస్లింల వాటా పెరుగుతున్నందున వారికున్న మైనారిటీ హోదాను తొలగించాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కోరారు. అనేక జిల్లాల్లో మెజారిటీ జనాభా ముస్లింలదేనని, ఈ క్రమంలో వారికి మైనారిటీ హోదా కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు.​
Tags:    
Advertisement

Similar News