కేంద్రం వద్దన్నా... మెట్రోరైల్‌పై చంద్రబాబు ముందుకే!

విజయవాడ మెట్రోరైల్ ఏర్పాటుకు ఉండాల్సిన లక్షణాలు లేవని, వ్యయం రీత్యా కూడా వయబిలీటీ లేదని కేంద్రం తేల్చి చెప్పినప్పటికీ చంద్రబాబు మాత్రం దీనిపై ముందుకే వెళ్లాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు. విజయవాడ మెట్రో రైల్ పనులను 2018 నాటికి పూర్తి చేయాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఈవిషయాన్నే స్పష్టం చేస్తోంది. మెట్రోరైల్ నిఫుణుడు శ్రీధరన్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మెట్రో రైలుకు నిధుల కొరత లేదని, జపాన్‌కు చెందిన జైకా […]

Advertisement
Update: 2015-09-03 13:19 GMT
విజయవాడ మెట్రోరైల్ ఏర్పాటుకు ఉండాల్సిన లక్షణాలు లేవని, వ్యయం రీత్యా కూడా వయబిలీటీ లేదని కేంద్రం తేల్చి చెప్పినప్పటికీ చంద్రబాబు మాత్రం దీనిపై ముందుకే వెళ్లాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు. విజయవాడ మెట్రో రైల్ పనులను 2018 నాటికి పూర్తి చేయాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఈవిషయాన్నే స్పష్టం చేస్తోంది. మెట్రోరైల్ నిఫుణుడు శ్రీధరన్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మెట్రో రైలుకు నిధుల కొరత లేదని, జపాన్‌కు చెందిన జైకా సంస్థ ఆర్దిక సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రతినెల మెట్రో రైలు ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఈ ప్రాజెక్టుపై వేగంగా పురోగతి సాగించాలని ఆయన అన్నారు.
Tags:    
Advertisement

Similar News