ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆంధప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో వైసీపీ సభ్యలు తమ ఆందోళనను కొనసాగించారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ క్రమంలో కోడెలకు రాసిన లేఖలో స్పీకర్ స్థానాన్ని కించపర్చారంటూ కేవీపై, స్పీకర్‌ అనుమతి లేకుండా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం పెట్టినవారిపై టీడీపీ సభా ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులపై ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు స్పీకర్ తెలిపారు. […]

Advertisement
Update: 2015-09-04 04:31 GMT
ఆంధప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో వైసీపీ సభ్యలు తమ ఆందోళనను కొనసాగించారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ క్రమంలో కోడెలకు రాసిన లేఖలో స్పీకర్ స్థానాన్ని కించపర్చారంటూ కేవీపై, స్పీకర్‌ అనుమతి లేకుండా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం పెట్టినవారిపై టీడీపీ సభా ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులపై ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్ కోడెల సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఐదురోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో 9 బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
Tags:    
Advertisement

Similar News