అసెంబ్లీలో సవాళ్ళు... ప్రతి సవాళ్ళు!

అసెంబ్లీ మంగళవారంనాడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు వేదికైంది. జగన్‌ మీద మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలు, దానిపై స్పందిస్తూ జగన్‌ చేసిన ప్రకటనతో సభ వేడెక్కింది. సవాల్‌… సవాల్‌… అంటూ మంత్రి రెచ్చిపోగా… ఛాలంజ్‌… ఛాలంజ్‌… ఛాలంజ్‌… అంటూ జగన్‌ బిగ్గరగా అరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీంతో అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చ పక్కదారి పట్టి అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఓటుకు నోటు కేసులో ప్రతిపక్ష నేత […]

Advertisement
Update: 2015-09-01 05:25 GMT
అసెంబ్లీ మంగళవారంనాడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు వేదికైంది. జగన్‌ మీద మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలు, దానిపై స్పందిస్తూ జగన్‌ చేసిన ప్రకటనతో సభ వేడెక్కింది. సవాల్‌… సవాల్‌… అంటూ మంత్రి రెచ్చిపోగా… ఛాలంజ్‌… ఛాలంజ్‌… ఛాలంజ్‌… అంటూ జగన్‌ బిగ్గరగా అరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీంతో అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చ పక్కదారి పట్టి అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఓటుకు నోటు కేసులో ప్రతిపక్ష నేత జగన్ హస్తం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని జగన్ ప్రకటించారు. టిఆర్ఎస్‌కు నేను లేఖ ఇస్తే స్టీఫెన్ సన్‌కు తెలంగాణ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు చెబుతున్నారని, తాను ఏదో హోటల్లో టి మంత్రి హరీష్‌రావును కలిసినట్లు చెబుతున్నారని, కానీ అవన్నీ అవాస్తవాలు అని జగన్ అన్నారు. నేను టిఆర్ఎస్‌కు లేఖ ఇస్తే ఆ లేఖ మీ వద్దకు ఎలా వచ్చిందని, ఆయన మీకు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు స్టీఫెన్‌సన్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. టిడిపికి దమ్ము ధైర్యం ఉంటే.. తాను లేఖ ఇస్తేనే స్టీఫెన్‌ను తెలంగాణ ఎమ్మెల్సీ చేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఏదో హోటల్ పేరు చెప్పారని, అది కూడా తనకు తెలియదన్నారు. నేను సవాల్ చేస్తున్నానని.. తాను లేఖ ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. ఛాలెంజ్.. ఛాలెంజ్.. ఛాలెంజ్ అటూ జగన్ గట్టిగా మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీలు కావాల‌నుకుంటే అందుకుత‌గ్గ ఎమ్మె‌ల్యేలు ఉన్నా‌ర‌ని తానే తనకు నచ్చిన వారిని సభకు పంపిస్తా కదా అన్నారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు జగన్ సవాలును స్వీకరించారు. జగన్ కెసిఆర్‌తో పని చేశారని, అందుకు ఆధారాలున్నాయని, ఇంతకంటే దారుణం మరొకటి లేదని మండిపడ్డారు. జగన్ విషయమై తమ వద్ద ఆధారాలున్నాయని, అవి ఎలాగొచ్చాయో చెప్పాలన్న డిమాండు పిచ్చివాడి మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
Tags:    
Advertisement

Similar News