Wonder World 13

కాలుష్యకాసారం బీజింగ్‌ నగరం! అత్యంత కాలుష్యనగరంగా చైనా రాజధాని బీజింగ్‌ ఎప్పుడో పేరు సంపాదించేసింది. అక్కడ కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే చాలాసార్లు జనం ఇళ్లలోనే ఉండిపోతారు. పిల్లలు ఆడుకోవడానికి క్లీన్‌ ఎయిర్‌ డోమ్‌లను అద్దెకు తీసుకుంటుంటారు. 2014 బీజింగ్‌ మారథాన్‌లో చాలామందిని నిర్వాహకులు మధ్యలోనే ఆపేశారు. వారి మాస్క్‌ ఫిల్టర్లు నిండిపోవడమే అందుకు ప్రధాన కారణం. బీజింగ్‌లో వాతావరణం మానవులు నివసించడానికి పనికివచ్చేది కాదని నిపుణులు చాలా క్రితమే నిర్ణయించారు కూడా. —————————————————————————————- బైబిల్‌లో చోటు సాధించిన శునకం […]

Advertisement
Update: 2015-08-31 05:04 GMT

కాలుష్యకాసారం బీజింగ్‌ నగరం!

అత్యంత కాలుష్యనగరంగా చైనా రాజధాని బీజింగ్‌ ఎప్పుడో పేరు సంపాదించేసింది. అక్కడ కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే చాలాసార్లు జనం ఇళ్లలోనే ఉండిపోతారు. పిల్లలు ఆడుకోవడానికి క్లీన్‌ ఎయిర్‌ డోమ్‌లను అద్దెకు తీసుకుంటుంటారు.
2014 బీజింగ్‌ మారథాన్‌లో చాలామందిని నిర్వాహకులు మధ్యలోనే ఆపేశారు. వారి మాస్క్‌ ఫిల్టర్లు నిండిపోవడమే అందుకు ప్రధాన కారణం. బీజింగ్‌లో వాతావరణం మానవులు నివసించడానికి పనికివచ్చేది కాదని నిపుణులు చాలా క్రితమే నిర్ణయించారు కూడా.
—————————————————————————————-
బైబిల్‌లో చోటు సాధించిన శునకం

బైబిల్‌లో ప్రస్తావించబడిన ఓ శునకం పేరు ఆ తరహా శునకాల జాతి పేరుగా స్థిరపడిపోయింది. అదే.. గ్రేహౌండ్‌.
—————————————————————————————-
మెదడుకు అన్ని బాధలూ ఒకటే!

మానసిక పరమైన బాధకు, భౌతికపరమైన బాధకు మన మెదడు ఒకే విధంగా స్పందిస్తుందని అధ్యయనాలలో తేలింది. ఎవరైనా మనలను తిడితే మన మనసు ఎంత బాధపడుతుందో మన దేహంలో ఏదైనా భాగానికి దెబ్బతగిలితే కూడా అంతే బాధపడుతుందట. అంటే గుండె పగిలినా, చేయి విరిగినా మనసుకు కలిగే నొప్పి ఒకటేనన్న మాట.

Tags:    
Advertisement

Similar News