పోరాడితేనే ప్రభుత్వం దిగి వస్తుంది: కోదండరాం

రైతు రుణమాఫీ పథకం చాలా గందరగోళంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చి తీరాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టుగానే రైతు సమస్యలను పరిష్కరించుకోవాలని […]

Advertisement
Update: 2015-08-31 06:32 GMT
రైతు రుణమాఫీ పథకం చాలా గందరగోళంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చి తీరాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టుగానే రైతు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరో వస్తారు… ఏదో చేస్తారని ఆశించడం కన్నా ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకునేందుకు నడుం బిగించాలని కోదండరాం అన్నారు. రెవిన్యూ, కరెంటు, బ్యాంకు సమస్యలపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయడానికి రైతులంతా నడుం బిగించాలని ఆయన పిలుపు ఇచ్చారు.
Tags:    
Advertisement

Similar News