బైక్‌పై నుంచి పడ్డ గల్లా జయదేవ్‌... అపోలోలో చికిత్స

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ బైక్‌ మీద నుంచి పడిపోవడంతో ఆయనకు వెన్నులో గాయమైంది. స్పోర్ట్స్ బైక్ కొనడం కోసం నగరంలోని ఒక ప్రముఖ షాప్‌కు వెళ్ళిన జయదేవ్ బైక్ ట్రయల్ రన్‌ చేస్తుండగా అదుపు తప్పి ఆయన కింద పడిపోయారు. ఆయన చేతికి, కాలికి కూడా దెబ్బలు తగిలాయి. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని జుబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. జయదేవ్‌కు చికిత్స జరుగుతోంది. ఆయన వెన్నులో ఒక ఎముక విరిగిపోయినట్టు […]

Advertisement
Update: 2015-08-31 11:02 GMT

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ బైక్‌ మీద నుంచి పడిపోవడంతో ఆయనకు వెన్నులో గాయమైంది. స్పోర్ట్స్ బైక్ కొనడం కోసం నగరంలోని ఒక ప్రముఖ షాప్‌కు వెళ్ళిన జయదేవ్ బైక్ ట్రయల్ రన్‌ చేస్తుండగా అదుపు తప్పి ఆయన కింద పడిపోయారు. ఆయన చేతికి, కాలికి కూడా దెబ్బలు తగిలాయి. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని జుబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. జయదేవ్‌కు చికిత్స జరుగుతోంది. ఆయన వెన్నులో ఒక ఎముక విరిగిపోయినట్టు తెలుస్తోంది. ఆర్థోపిడియన్స్‌ బృందం దీనికి చికిత్స చేస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

Tags:    
Advertisement

Similar News