ఒడిశాలో మ‌రో దొంగ బాబా గుట్టురట్టు!

ఒడిశాలో ప్రజలు మరో దొంగ బాబా భరతం పట్టారు. అక్రమంగా ఆశ్రమాన్ని నిర్మించడమే కాకుండా తన ఆశ్రమానికి వస్తున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అతడిపై దాడికి పాల్పడి ఆయన ఆస్తులను ధ్వంసం చేశారు. సురా బాబా అనే వ్యక్తి తనకు తాను ఆధ్మాత్మిక గురువుగా ప్రకటించుకోవడమే కాకుండా భారీ మొత్తంలో స్తలాన్ని ఆక్రమించి ఆశ్రమం నిర్మించాడు. ఆయన ఆశ్రమానికి వస్తున్న మహిళలపై భక్తి పేరిట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పలువురు మహిళలు స్థానికులకు ఫిర్యాదు […]

Advertisement
Update: 2015-08-30 13:17 GMT
ఒడిశాలో ప్రజలు మరో దొంగ బాబా భరతం పట్టారు. అక్రమంగా ఆశ్రమాన్ని నిర్మించడమే కాకుండా తన ఆశ్రమానికి వస్తున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అతడిపై దాడికి పాల్పడి ఆయన ఆస్తులను ధ్వంసం చేశారు. సురా బాబా అనే వ్యక్తి తనకు తాను ఆధ్మాత్మిక గురువుగా ప్రకటించుకోవడమే కాకుండా భారీ మొత్తంలో స్తలాన్ని ఆక్రమించి ఆశ్రమం నిర్మించాడు. ఆయన ఆశ్రమానికి వస్తున్న మహిళలపై భక్తి పేరిట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పలువురు మహిళలు స్థానికులకు ఫిర్యాదు చేయడంతో వారంతా ఆశ్రమంపై దాడికి దిగారు. ప్రస్తుతం సురాబాబాను అతడి ఇద్దరి కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    
Advertisement

Similar News