ఎంత ఎదిగినా! ఒదగలేకపోతున్నా!
ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తెలియకుండానే రికార్డులు తిరగరాశాడు. భారతదేశంలోనే అత్యంత పొడగరిగా వరల్డ్ రికార్డ్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. అయితే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేందుకు శరీరం సహకరించట్లేదు. పొడుగుతోపాటు వయస్సూ పెరిగింది. అతడే ఉత్తరప్రదేశ్ రాష్ర్టం మీరట్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్. 8 అడుగుల ఒక అంగుళం పొడవు అంటే.. 2.4 మీటర్లుండే సింగ్ దేశంలో అత్యంత పొడగరిగా సుపరిచితుడయ్యాడు. ధర్మేంద్రసింగ్ను ప్రపంచానికి పరిచయం చేసిన పొడుగు..అతని జీవితానికి శాపంగా మారింది. యుక్త వయస్సు వచ్చినా..పొడుగు […]
Advertisement
ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తెలియకుండానే రికార్డులు తిరగరాశాడు. భారతదేశంలోనే అత్యంత పొడగరిగా వరల్డ్ రికార్డ్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. అయితే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేందుకు శరీరం సహకరించట్లేదు. పొడుగుతోపాటు వయస్సూ పెరిగింది. అతడే ఉత్తరప్రదేశ్ రాష్ర్టం మీరట్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్. 8 అడుగుల ఒక అంగుళం పొడవు అంటే.. 2.4 మీటర్లుండే సింగ్ దేశంలో అత్యంత పొడగరిగా సుపరిచితుడయ్యాడు. ధర్మేంద్రసింగ్ను ప్రపంచానికి పరిచయం చేసిన పొడుగు..అతని జీవితానికి శాపంగా మారింది. యుక్త వయస్సు వచ్చినా..పొడుగు కారణంగా పెళ్లి కావడంలేదని సింగ్ మథనపడుతున్నాడు. పెళ్లి కాకపోయినా ఫర్వాలేదు..కనీసం జీవనం సాగించేందుకు ఓ ఉద్యోగం కూడా దొరకడంలేదని..వాపోతున్నాడు. హిందీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన సింగ్ ఏ ఆఫీస్‌కు ఉద్యోగం కోసం వెళ్లినా..పొడుగు చూసి ఉద్యోగం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని బాధపడుతున్నాడు. చివరికి జీవనోపాధి కోసం ఎమ్యూజ్మెంట్ పార్క్ వద్ద ..తన పొడుగు శరీరంతో వచ్చిపోయేవారిని నవ్విస్తూ..వారిచ్చే పదో పరకో తీసుకుని కాలం గడుపుతున్నాడు ధర్మేంద్రసింగ్. కొంతమంది అత్యంత పొడగరి అయిన సింగ్‌తో ఫోటో దిగి ఓ పదిరూపాయలు చేతిలో పెడతారు. మరికొందరు ఫోటో దిగి..పారిపోతారని చెబుతున్నాడీ టాలెస్ట్ మేన్. జన్యుపరమైన సమస్య కారణంగా తనకీ పొడవు ప్రాప్తించిందని.. పెళ్లి, ఉద్యోగానికి దూరం చేసిన పొడవు తన పాలిట శాపంగా మారిందని సింగ్ బాధపడుతున్నాడు.
Advertisement