విదేశీ కందిపప్పు కిలో... రూ. 67

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ కొండెక్కి కూర్చుంటుండటంతో రాష్ర్టాలకు కొంచెం వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కందిపప్పుపై రాష్ర్టాలకు రూ.10 సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిగుమతి చేసుకొంటున్న కందిపప్పు ప్రస్తుతం కిలో రూ.77 ఉంది. రూ.10 సబ్సిడీతో దానిని రూ.67కే రాష్ర్టాలకు ఇవ్వనున్నట్లు కేంద్ర వ్యవసాయ విభాగం అదనపు కార్యదర్శి అవినాశ్ శ్రీవాత్సవ తెలిపారు. దిగుమతి చేసుకొంటున్న కందిపప్పు వచ్చేనెల ఒకటోతేదీ నాటికి భారత్‌కు రావటం […]

Advertisement
Update: 2015-08-25 13:07 GMT
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ కొండెక్కి కూర్చుంటుండటంతో రాష్ర్టాలకు కొంచెం వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కందిపప్పుపై రాష్ర్టాలకు రూ.10 సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిగుమతి చేసుకొంటున్న కందిపప్పు ప్రస్తుతం కిలో రూ.77 ఉంది. రూ.10 సబ్సిడీతో దానిని రూ.67కే రాష్ర్టాలకు ఇవ్వనున్నట్లు కేంద్ర వ్యవసాయ విభాగం అదనపు కార్యదర్శి అవినాశ్ శ్రీవాత్సవ తెలిపారు. దిగుమతి చేసుకొంటున్న కందిపప్పు వచ్చేనెల ఒకటోతేదీ నాటికి భారత్‌కు రావటం మొదలవుతుందని, 15 తేదీ నాటికి 5000 టన్నుల పప్పు దిగుమతి అవుతుంది. అలాగే అక్టోబర్ మొదటివారంలోగా మరో 5000 టన్నుల మినపప్పును కూడా దిగుమతి చేసుకొంటామని చెప్పారు.
Tags:    
Advertisement

Similar News