రానున్నది మనసున్న ప్రభుత్వం: జగన్‌

త్వరలోనే మనస్సున్న సమస్యలు తీర్చే ప్రభుత్వం వస్తుందని, అంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం దుష్పరిపాలన భరించాల్సిందేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వానికి కనీస సౌకర్యాలు తీర్చాలన్న థ్యాస కూడా లేదని ఆయన విమర్శించారు. మంచినీరు అందించడంలో కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదని, అలాగే గ్రామాల్లో మంచినీటి ట్యాంకులు కూడా శుభ్రం చేయడం లేదని, వీటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. మంగళవారం బందరులో ఏర్పాటు చేసిన […]

Advertisement
Update: 2015-08-25 03:53 GMT
త్వరలోనే మనస్సున్న సమస్యలు తీర్చే ప్రభుత్వం వస్తుందని, అంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం దుష్పరిపాలన భరించాల్సిందేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వానికి కనీస సౌకర్యాలు తీర్చాలన్న థ్యాస కూడా లేదని ఆయన విమర్శించారు. మంచినీరు అందించడంలో కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదని, అలాగే గ్రామాల్లో మంచినీటి ట్యాంకులు కూడా శుభ్రం చేయడం లేదని, వీటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. మంగళవారం బందరులో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. జర్వాలతో జనం మరణిస్తున్నా పట్టించుకున్న నాధులు లేరని, కొత్తమాజేరులో 18 మంది చనిపోతే వైద్యులు స్పందించలేదని, కనీసం వారిని పరామర్శించే వారే కరవయ్యారని జగన్‌ ఆరోపించారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వక్కర్లేదా అని అంటూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో చెక్కులు అందిస్తామని హామీ ఇచ్చారు. సామాన్యుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం సీఎం పరామర్శించడం లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలన ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. కృష్ణా డెల్టా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, తెలంగాణతో పోటీ పడి కరెంట్‌ కోసమని నీళ్ళు డ్రా చేయడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. మోసాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఈ ప్రభుత్వం ఎంతోకాలం మనుగడ సాగించదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన సాగడం లేదని, ప్రజల గోడు వినడానికి అధికారులు కూడా సిద్ధంగా లేరని ఆయన అన్నారు.
Tags:    
Advertisement

Similar News