భూ చట్టం వద్దు: పవన్‌ X మరేం చేయాలి: యనమల

మూడు రోజల క్రితం రాజధాని భూములపై ట్విట్టర్‌లో కనిపించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాజాగా మరోసారి గళం విప్పారు. రాజధాని నిర్మాణం కోసం భూముల స్వాధీనానికి భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవద్దని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు మరోసారి ఆలోచించాలని పవన్‌ కోరారు. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక, బేతపూడిలతోపాటు నదిని అనుకుని ఉన్న గ్రామాల జోలికి […]

Advertisement
Update: 2015-08-19 02:44 GMT
మూడు రోజల క్రితం రాజధాని భూములపై ట్విట్టర్‌లో కనిపించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాజాగా మరోసారి గళం విప్పారు. రాజధాని నిర్మాణం కోసం భూముల స్వాధీనానికి భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవద్దని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు మరోసారి ఆలోచించాలని పవన్‌ కోరారు. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక, బేతపూడిలతోపాటు నదిని అనుకుని ఉన్న గ్రామాల జోలికి వెళ్ల వద్దని ఆయన కోరారు. అభివృద్ధి చేయాలంటే ఒక వర్గమో, ఒక ప్రాంతమో నష్టపోవడం సహజమే అయినా అది ఎంత తక్కువగా ఉంటే ప్రజలకు అంత మేలు చేసినట్టుగా అవుతుందని ఆయన అన్నారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కనీస నష్టంతో పాలన సాగించే పాలకులు వివేకవంతులుగా మిగులుతారని ఆయన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణాన్ని కాపాడాలని పవన్‌ కోరారు.
ఏం చేయాలో పవనే చెప్పాలి: యనమల
భూ సేకరణ చట్టం ప్రయోగించొద్దు… భూములు తీసుకోవద్దు.. అంటే ఎలా అంటూ ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భూ సేకరణ చట్టం అమలు చేయడం కొన్ని గ్రామాలకు మినహాయించాలంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ యనమల, పరిహారం పెంచమని అడగడం సమంజసంగా ఉంటుంది కాని ఏకంగా భూ సేకరణే చేయొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. పోనీ ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా పవన్‌ కల్యాణే చెబితే బాగుంటుందని ఆయన అన్నారు. దీన్నిబట్టి ఈ నెల 20 నుంచి భూ సేకరణ చేపడతామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం ఇందుకే కట్టుబడి ఉన్నట్టు అర్ధమవుతుంది. మరిప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే
Tags:    
Advertisement

Similar News