ఐక్యత, అభివృద్ధికి చిరునామా గంగదేవిపల్లి: కేసీఆర్‌

ఐకమత్యానికి, అభివృద్ధికి గంగదేవిపల్లి చక్కని చిరునామా అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. అభివృద్ధి చేసి చూపించడం ఎలాగో ఈ గ్రామ ప్రజల నుంచి చూసి నేర్చుకోవాలని, అందుకే తాను ఇక్కడ గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. గ్రామాభివృద్ధిపై గ్రామస్తులదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రినే గంగదేవిపల్లికి రప్పించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందని […]

Advertisement
Update: 2015-08-17 06:07 GMT
ఐకమత్యానికి, అభివృద్ధికి గంగదేవిపల్లి చక్కని చిరునామా అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. అభివృద్ధి చేసి చూపించడం ఎలాగో ఈ గ్రామ ప్రజల నుంచి చూసి నేర్చుకోవాలని, అందుకే తాను ఇక్కడ గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. గ్రామాభివృద్ధిపై గ్రామస్తులదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రినే గంగదేవిపల్లికి రప్పించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందని ఆయన కొనియాడారు. గ్రామజ్యోతిలో భాగంగా గంగదేవిపల్లి అభివృద్ధికి కేసీఆర్‌ రూ. 10 కోట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గంగదేవిపల్లి గ్రామస్తులపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజలంతా కమిటీలుగా ఏర్పడి సమస్యలు పరిష్కరించుకుంటున్నారని కొనియాడారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటే సమస్యలు అవే పరిష్కారం అవుతాయని సూచించారు. అందుకు గంగదేవిపల్లి గ్రామమే ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఏదైనా చేయగలమనే పట్టుదల గ్రామ ప్రజల్లో మెండుగా ఉందని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Tags:    
Advertisement

Similar News