'రెస్పెక్ట్‌ ఫ్రీడం- రెస్పెక్ట్‌ విమెన్‌' మహిళల వాక్‌

‘రెస్పెక్ట్‌ ఫ్రీడం- రెస్పెక్ట్‌ విమెన్‌’ అనే నినాదంతో విశాఖలో మహిళలు రాత్రి వేళ ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీడం వాక్‌ చేశారు. మేరా భారత్‌ మహాన్‌ నినాదాలతో హోరెత్తించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలను గౌరవించాలని వారంతా కోరారు. సిరిపురం జంక్షన్‌ నుంచి భగత్‌సింగ్‌ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుంటే సరిపోదని, దాని ఫలాలు కనిపించేలా చేయాలని వారు కోరారు. అర్ధరాత్రి నడిరోడ్డులో స్వేచ్ఛగా మహిళ తిరగగలిగిననాడే స్వాతంత్ర్యం వచ్చినట్టు […]

Advertisement
Update: 2015-08-14 13:22 GMT
‘రెస్పెక్ట్‌ ఫ్రీడం- రెస్పెక్ట్‌ విమెన్‌’ అనే నినాదంతో విశాఖలో మహిళలు రాత్రి వేళ ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీడం వాక్‌ చేశారు. మేరా భారత్‌ మహాన్‌ నినాదాలతో హోరెత్తించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలను గౌరవించాలని వారంతా కోరారు. సిరిపురం జంక్షన్‌ నుంచి భగత్‌సింగ్‌ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుంటే సరిపోదని, దాని ఫలాలు కనిపించేలా చేయాలని వారు కోరారు. అర్ధరాత్రి నడిరోడ్డులో స్వేచ్ఛగా మహిళ తిరగగలిగిననాడే స్వాతంత్ర్యం వచ్చినట్టు భావించాలన్న మహాత్ముడి మాటలు ఇప్పటికీ నెరవేరలేదని వాక్‌లో పాల్గొన్న వారు వ్యాఖ్యానించారు.
Tags:    
Advertisement

Similar News