ఇళయరాజా యూట్యూబ్‌ ఛానల్‌!

స్వరానికి దొరికిన వరం ఆయన. గాలితో రాగాలు పలికించి, రాయిని సైతం కరిగించే సంగీత జ్ఞానం ఆయన సొంతం. ఇళయరాజా పాట వింటే ఆ లయరాజు కూడా పరవశించిపోతాడంతే.. స్వరకల్పనలో దివ్యత్వం చూపించిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. తమిళుడైనా ప్రతి భారతీయుడూ గర్వంగా మా సంగీత దర్శకుడు అని చెప్పుకునేంత గొప్ప సంగీత దర్శకుడు ఈ లయ రాజా. ఈయన పేరుపై వెలిసిన అనధికార వెబ్‌సైట్లకు చెక్‌ పెట్టేందుకు.. ఇళయరాజా కొత్త యూట్యూబ్‌ చానల్‌ను చెన్నైలో […]

Advertisement
Update: 2015-08-15 04:07 GMT
స్వరానికి దొరికిన వరం ఆయన. గాలితో రాగాలు పలికించి, రాయిని సైతం కరిగించే సంగీత జ్ఞానం ఆయన సొంతం. ఇళయరాజా పాట వింటే ఆ లయరాజు కూడా పరవశించిపోతాడంతే.. స్వరకల్పనలో దివ్యత్వం చూపించిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. తమిళుడైనా ప్రతి భారతీయుడూ గర్వంగా మా సంగీత దర్శకుడు అని చెప్పుకునేంత గొప్ప సంగీత దర్శకుడు ఈ లయ రాజా. ఈయన పేరుపై వెలిసిన అనధికార వెబ్‌సైట్లకు చెక్‌ పెట్టేందుకు.. ఇళయరాజా కొత్త యూట్యూబ్‌ చానల్‌ను చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు.
ఒకటా రెండా.. వేల పాటలు ఇళయరాజా సంగీతంలో ప్రాణం పోసుకున్నాయి. ఇవన్నీ ఇపుడు www.ilayarajalive.com పేరుతో యూట్యూబ్ చానెల్‌లో హల్‌చల్‌ చేయనున్నాయి. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సాంగ్స్‌కు సంగీతం అందించిన ఇళయరాజా పేరుపై దేశంలో ఎవరి పేరుపై లేనన్నీ వెబ్‌సైట్లు వెలిశాయి. అనధికారికంగా ఉన్న వెబ్‌సైట్లు ఇళయరాజా పేరును ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నాయట. దీంతో వీటన్నింటికి చెక్‌ పెట్టాలని నిర్ణయించిన ఇళయరాజా.. తనే ఓ చానెల్ ప్రారంభిస్తే మంచిదనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చెన్నైలో www.ilayarajalive.com పేరుతో పెట్టిన ఈ ఛానలే తన అధికారిక యూట్యూబ్ చానెల్ అని స్పష్టంచేశారు. ఇప్పటి వరకూ తాను అందించిన సినీ, ప్రైవేట్ ఆల్బమ్స్‌ సంగీతం మొత్తాన్ని నేటి తరానికి య్యూటూబ్ చానెల్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News