మోడీ సర్కారుకు టీడీపీ, టీఆర్‌ఎస్‌ అండ

సుష్మా స్వరాజ్‌పై వ్యవహారంలో కేంద్రానికి టీడీపీ, టీఆర్‌ఎస్‌ అండగా నిలబడ్డాయి. లలిత్‌ మోదీ వ్యవహారంపై చర్చలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేతలు తోట నరసింహం, జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సుష్మాపై ఆరోపణల్లో బలం లేదని అన్నారు. పలు ప్రజా సమస్యలపై చర్చ కోసం సభకు వస్తుంటే, కాంగ్రెస్‌ వైఖరితో చర్చ జరగక ప్రజల్లో చులకనయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ వల్ల రూ.260 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. కాగా లలిత్‌మోదీ వ్యవహారంపై సమగ్ర విచారణ తర్వాతే […]

Advertisement
Update: 2015-08-12 13:10 GMT
సుష్మా స్వరాజ్‌పై వ్యవహారంలో కేంద్రానికి టీడీపీ, టీఆర్‌ఎస్‌ అండగా నిలబడ్డాయి. లలిత్‌ మోదీ వ్యవహారంపై చర్చలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేతలు తోట నరసింహం, జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సుష్మాపై ఆరోపణల్లో బలం లేదని అన్నారు. పలు ప్రజా సమస్యలపై చర్చ కోసం సభకు వస్తుంటే, కాంగ్రెస్‌ వైఖరితో చర్చ జరగక ప్రజల్లో చులకనయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ వల్ల రూ.260 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. కాగా లలిత్‌మోదీ వ్యవహారంపై సమగ్ర విచారణ తర్వాతే తప్పు ఎవరిదో నిర్ణయించాలని వైసీపీపీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు.
Tags:    
Advertisement

Similar News