ఆలయంలో తొక్కిసలాట...12 మంది మృతి

జార్ఖాండ్‌ రాష్ట్రం దియోగఢ్‌లో దుర్గామాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయం మొత్తం కిక్కిరిసి పోయింది. దీంతో భక్తులు ఒకరిమీద ఒకరి పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మరో 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్యూలైన్లను సరిగా పాటించక పోవడంతో ఈ సంఘటన జరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి. అధికారులు గాయపడిన వారిని ఆసుపత్రికి […]

Advertisement
Update: 2015-08-10 02:04 GMT
జార్ఖాండ్‌ రాష్ట్రం దియోగఢ్‌లో దుర్గామాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయం మొత్తం కిక్కిరిసి పోయింది. దీంతో భక్తులు ఒకరిమీద ఒకరి పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మరో 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్యూలైన్లను సరిగా పాటించక పోవడంతో ఈ సంఘటన జరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి. అధికారులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. కాగా పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే జార్ఖాండ్‌లోని దియోగఢ్‌లో దుర్గామాత ఆలయంలో తొక్కిసలాటలో మృతిచెందిన వారికి లోక్‌సభ సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సభ్యులు ఆకాంక్షించారు.
Tags:    
Advertisement

Similar News