ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్యా యత్నం!
ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన ‘పోరు సభ’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మునికోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన సభలో ఉన్న వారు యువకుని శరీరానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. ఎన్నికల సమయంలోను, పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలోను ఇచ్చిన హామీని ఎందుకు అమలు పరచరంటూ నినదించాడు. అంతటితో ఆగలేదు. ఒకవైపు సభ జరుగుతుండగానే హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆ యువకుడు […]
Advertisement
ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన ‘పోరు సభ’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మునికోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన సభలో ఉన్న వారు యువకుని శరీరానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. ఎన్నికల సమయంలోను, పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలోను ఇచ్చిన హామీని ఎందుకు అమలు పరచరంటూ నినదించాడు. అంతటితో ఆగలేదు. ఒకవైపు సభ జరుగుతుండగానే హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేశాడు. దాదాపు 70 శాతం గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అనూహ్య ఘటనకు కాంగ్రెస్ నాయకులంతా కంగారు పడిపోయారు. కాలిపోతున్న యువకుడ్ని చూసి అందరూ ఖిన్నులైపోయారు. వెంటనే తేరుకుని మంటలు ఆవహించిన అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటలు తీవ్రంగా వ్యాపించి బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా పోయింది. వెంటనే అతన్ని స్థానిక రుయా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తరలించారు. శరీరం దాదాపు 70 కాలిపోవడంతో యువకుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆస్పత్రి వైద్యులు కృషిచేస్తున్నారు. పోరు సభలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు తిరుపతి మంచాలవీధికి చెందిన మునికోటిగా గుర్తించారు. కాగా ఈ పోరు సభలో ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, చిరంజీవి, ఇతర నేతలు పాల్గొన్నారు.
కోటి కుటుంబాన్ని ఆదుకుంటాం: రఘువీరా
ఏపీ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బహిరంగ సభలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న కోటిని రుయా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోటి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మునికోటిని రక్షించడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా గాయపడిన మరో యువకుడికి రూ.50 వేలు ప్రకటించారు. కోటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దదని రఘువీరా సూచించారు. పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. పవిత్ర తిరుపతి నుంచి ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభమైందని రఘువీరా రెడ్డి అన్నారు.
ఆత్మహత్యలొద్దు: చలసాని శ్రీనివాస్
యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్రా మేథావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ మోసం చేసిన నాయకులే ఆత్మహత్య చేసుకోవాలని ఆయన విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుదామని చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దీనిపై సోమవారం కార్యాచరణ ప్రకటిస్తామస్తారు.
తెలుగువారి ఘోషకు ప్రతిబింబం ఆ యువకుడు: హీరో శివాజీ
తిరుపతిలో ఆత్మహత్యకు చేసుకున్న యువకుడు ప్రత్యేక హోదా కోసం పరితపిస్తున్న ఆంధ్రుల ఘోషకు, ఆవేదనకు ప్రతిరూపమని ఫ్రత్యేకహోదా పోరాట సమితి కన్వీనర్, హీరో శివాజీ అన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిస్తే మంచిదని, తెలుగుదేశం ఈ స్పందన చూస్తేనా బుద్ది తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి ప్రత్యేకహోదా కోసం ప్రయత్నించాలని కోరారు.