లెస్బియన్ చేతిలో యువతి హత్య!
తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ లెస్బియన్ యువతి మరో యువతిని దారుణంగా పొడిచి చంపిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌లోని రైల్వేకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే కాలనీలో ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే ఓ యువతిని మరో యువతి ప్రేమించాలంటూ వెంటపడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒత్తిడి తీవ్రతరం చేసింది. శుక్రవారం ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో పథకం ప్రకారం కత్తితో వచ్చిన లెస్బియన్ యువతి […]
Advertisement
తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ లెస్బియన్ యువతి మరో యువతిని దారుణంగా పొడిచి చంపిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌లోని రైల్వేకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే కాలనీలో ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే ఓ యువతిని మరో యువతి ప్రేమించాలంటూ వెంటపడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒత్తిడి తీవ్రతరం చేసింది. శుక్రవారం ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో పథకం ప్రకారం కత్తితో వచ్చిన లెస్బియన్ యువతి బాధిత యువతిని కత్తితో పొడిచింది. తీవ్రగాయాలతో రక్తస్రావం అయిన బాధితయువతి అక్కడే కుప్పకూలింది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. నిందితురాలు అయిన లెస్బియన్ పరారీలో ఉంది. పోలీసులు అమె కోసం గాలిస్తున్నారు.
Advertisement