ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నాం : సుజన

ప్రత్యేక హోదాపై సోమవారం సభలో చర్చకు అనుమతిస్తామని కేంద్రం చెప్పిందని, అయినా కాంగ్రెస్‌ చేసిన యాగీ వల్ల సభ వాయిదా పడి ప్రభుత్వ హామీ నెరవేరలేదని, యూపీఏ వల్ల నష్టపోయిన రాష్ట్రం… కాంగ్రెస్‌ వల్ల కూడా ఇలా నష్టపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. హోదా విషయంలో సుజనా చౌదరి మరో విషయాన్ని చెప్పారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరగకముందే 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా […]

Advertisement
Update: 2015-08-03 13:10 GMT
ప్రత్యేక హోదాపై సోమవారం సభలో చర్చకు అనుమతిస్తామని కేంద్రం చెప్పిందని, అయినా కాంగ్రెస్‌ చేసిన యాగీ వల్ల సభ వాయిదా పడి ప్రభుత్వ హామీ నెరవేరలేదని, యూపీఏ వల్ల నష్టపోయిన రాష్ట్రం… కాంగ్రెస్‌ వల్ల కూడా ఇలా నష్టపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. హోదా విషయంలో సుజనా చౌదరి మరో విషయాన్ని చెప్పారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరగకముందే 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాము తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హోదాపై సానుకూల సంకేతాలు ఉన్నాయని చెప్పారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్నారు.
Tags:    
Advertisement

Similar News