జనం ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జనం ప్రాణాలంటే లెక్కలేకుండా పోతుందని, పుష్కరాల్లో 30 మంది మరణించినా పెద్దగా స్పందించలేదని, అసలు ఆ సంఘటనే జరగనట్టు వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఆయన మాత్రం విదేశీ పర్యటనలకెళ్ళడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన అన్నారు. రాష్ట్రం ఒక పక్క ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రజాధనం అంటే ఆయనకు లెక్కలేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని కొత్తమాజేరులో ఆయన […]

Advertisement
Update: 2015-08-04 10:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జనం ప్రాణాలంటే లెక్కలేకుండా పోతుందని, పుష్కరాల్లో 30 మంది మరణించినా పెద్దగా స్పందించలేదని, అసలు ఆ సంఘటనే జరగనట్టు వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఆయన మాత్రం విదేశీ పర్యటనలకెళ్ళడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన అన్నారు. రాష్ట్రం ఒక పక్క ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రజాధనం అంటే ఆయనకు లెక్కలేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని కొత్తమాజేరులో ఆయన విష జ్వర బాధిత కుటుంబాలని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా ఇక్కడ 18 మంది వరకు మృతి చెందారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నాలుగు రోజుల్లోనే ఐదుగురు మరణించారన్నారు. ఐదేళ్లుగా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయలేదని జగన్‌ మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి లేదా ముఖ్యమంత్రిగాని ఇప్పటి వరకు ఇక్కడకు రాలేదన్నారు. వారు వచ్చి వెళ్లి ఉంటే పరిస్థితి తీవ్రత తగ్గి ఉండేదని, అధికారుల్లో చలనం వచ్చి ఉండేదని అన్నారు. ఇంతమంది చనిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని జగన్‌ ప్రశ్నించారు. గ్రామంలో 18 మంది చనిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News