పథకాల పేరుతో కేసీఆర్‌ మోసం: నాగం

కొత్త కొత్త పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తే ఊరుకోమన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించని కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకానికి రూ. 40 వేల కోట్లు కేటాయించడంలో […]

Advertisement
Update: 2015-08-02 00:46 GMT
కొత్త కొత్త పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తే ఊరుకోమన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించని కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకానికి రూ. 40 వేల కోట్లు కేటాయించడంలో మతలబు ఏంటని నాగం ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 15 వేల కోట్లు కేటాయిస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందిచవచ్చని ఆయన సూచించారు.
Tags:    
Advertisement

Similar News