ఘాటెక్కిన ఉల్లి... కిలో రూ. 40
ఉల్లిపాయలు కట్ చేయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. అందుకు కారణం రోజురోజుకీ పెరుగుతున్న ధరలే. పదిహేను రోజుల క్రితం వరకు కిలో ధర రూ. 15 పలికిన ఉల్లి ఇప్పుడు రూ. 40 పలుకుతోంది. అక్కడితో ఆగకుండా పైపైకి ఎగబాకుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజల వంటిళ్లు చిన్నబోతున్నాయి. ఉల్లి లేని కూరను ఊహించలేం. ఉల్లిగడ్డ వేయని కూర తినడానికి సహించదు. అందుకని ఉల్లిగడ్డ కొందామంటే జేబుకు చిల్లు. ఈ పరిస్థితుల్లో సగటు మధ్యతరగతి ప్రజలు నలిగి పోతున్నారు. తెలుగు […]
Advertisement
ఉల్లిపాయలు కట్ చేయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. అందుకు కారణం రోజురోజుకీ పెరుగుతున్న ధరలే. పదిహేను రోజుల క్రితం వరకు కిలో ధర రూ. 15 పలికిన ఉల్లి ఇప్పుడు రూ. 40 పలుకుతోంది. అక్కడితో ఆగకుండా పైపైకి ఎగబాకుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజల వంటిళ్లు చిన్నబోతున్నాయి. ఉల్లి లేని కూరను ఊహించలేం. ఉల్లిగడ్డ వేయని కూర తినడానికి సహించదు. అందుకని ఉల్లిగడ్డ కొందామంటే జేబుకు చిల్లు. ఈ పరిస్థితుల్లో సగటు మధ్యతరగతి ప్రజలు నలిగి పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్రలో వరదలతో ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో ఉల్లిధర కొండెక్కి కూర్చుంది. పైగా రోజురోజుకీ ధర పెరుగుతోంది. ఇదే సాకుగా వ్యాపారులు అక్రమ నిల్వలు చేస్తున్నారు. దీంతో సామాన్యులకు ఉల్లి దూరం అవుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఉల్లి ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement