ఈ సోఫాలో కూర్చుంటే కూల్‌కూల్‌ !

చల్లదనాన్ని పంచే ఏసీ సోఫాను గుజరాత్‌కు చెందిన ఒక మెకానిక్‌ తయారు చేశారు. దీన్ని ఆరుబయట కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. టవర్‌ ఏసీలకన్నా తక్కువ విద్యుత్‌ను ఇది ఉపయోగించుకుంటుంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన దశరథ్‌ పటేల్‌ దీన్ని తయారు చేశారు. ఆయన ఏసీలకు మరమ్మతులు చేస్తుంటాడు. కొన్నేళ్ళ కిందటే ఏసీ సోపా ఆలోచన వచ్చింది. దాన్ని సాకారం చేయడంలో ఆయనకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) నిపుణులు సాయం చేశారు. “సోపాలో ఏసీని అమర్చుదామని 2008లోనే అనుకున్నా. […]

Advertisement
Update: 2015-07-28 19:57 GMT
చల్లదనాన్ని పంచే ఏసీ సోఫాను గుజరాత్‌కు చెందిన ఒక మెకానిక్‌ తయారు చేశారు. దీన్ని ఆరుబయట కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. టవర్‌ ఏసీలకన్నా తక్కువ విద్యుత్‌ను ఇది ఉపయోగించుకుంటుంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన దశరథ్‌ పటేల్‌ దీన్ని తయారు చేశారు. ఆయన ఏసీలకు మరమ్మతులు చేస్తుంటాడు. కొన్నేళ్ళ కిందటే ఏసీ సోపా ఆలోచన వచ్చింది. దాన్ని సాకారం చేయడంలో ఆయనకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) నిపుణులు సాయం చేశారు. “సోపాలో ఏసీని అమర్చుదామని 2008లోనే అనుకున్నా. అప్పటినుంచి దానిపై కసరత్తు మొదలుపెట్టా. తొలుత నేను తయారు చేసిన సోఫా బరువు 175 కిలోలు. అది చాలా అధికం” అని పటేల్‌ చెప్పాడు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్న డిజైన్‌ క్లినిక్‌ పథకం గురించి తెలిసి, వారిని ఆశ్రయించినట్లు ఆయన పేర్కొన్నాడు. ఎన్‌ఐడీ తోడ్పాటుతో ఆశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్‌ఐడీ నిపుణులు తన డిజైన్‌లో మార్పులు చేశారని పటేల్‌ చెప్పాడు. అందులో వినియోగించిన పదార్థాలనూ మార్చారని వివరించాడు. దీంతో దాని బరువు 35 కిలోలకు తగ్గిందన్నాడు. దీన్ని తాను లక్ష నుంచి రూ. 1.25 లక్షల ధరతో త్వరలో మార్కెట్లో విక్రయించబోతున్నట్లు చెప్పాడు. “ఇది స్ల్పిట్‌ ఏసీలా పని చేస్తుంది. సోఫా లోపల ఉన్న విభాగాన్ని… బయట ఉన్న విభాగంతో ఒక గొట్టం ద్వారా అనుసంధానించాం. సోఫాలోని హ్యాండ్‌రెస్ట్‌ భాగం నుంచి గాలి ప్రవహిస్తుంది. ఉష్ణోగ్రతను రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు” అని వ్యాస్‌ చెప్పారు. టవర్‌ ఏసీల కన్నా ఇది 10 శాతం తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తుందని చెప్పారు.
Tags:    
Advertisement

Similar News