పెద్ద‌పేగు క్యాన్స‌ర్‌కు చేప‌ల‌తో చెక్‌!

మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి కొవ్వు, రక్తపోటు పెరగకుండా చేస్తూ.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. తాజాగా చేపల గురించి మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. వీటిని దండిగా తినేవారికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పూ తగ్గుతున్నట్టు తాజా అధ్య‌య‌నం ఒకటి వెల్లడిస్తోంది. అలాగే ఈ క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండటం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం […]

Advertisement
Update: 2015-07-26 23:47 GMT
మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి కొవ్వు, రక్తపోటు పెరగకుండా చేస్తూ.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. తాజాగా చేపల గురించి మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. వీటిని దండిగా తినేవారికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పూ తగ్గుతున్నట్టు తాజా అధ్య‌య‌నం ఒకటి వెల్లడిస్తోంది. అలాగే ఈ క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండటం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం తినటం, కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర వంటి ముప్పు కారకాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినా అటువంటి వారిలో చేపలతో చాలా మేలు జరుగుతున్నట్టు బయటపడింది. చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు. చేపలు తినే అలవాటు, క్యాన్సర్లకు గల సంబంధంపై గతంలో చేసిన 41 అధ్యయనాలను క్రోఢీకరించి ఈ ఫలితాలను అంచనా వేశారు. అందువల్ల చేపలను అంతగా తిననివారు వీటిని తరచుగా తీసుకోవటం ద్వారా గుండెజబ్బు, పెద్దపేగు క్యాన్సర్‌ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News