158 మంది లేట్‌నైట్‌ రోమియోల అరెస్ట్‌

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో సౌత్‌జోన్ పోలీసులు మంగళవారం రాత్రి నిర్వహించిన ఆపరేషన్‌ లేట్‌నైట్‌ రోమియోస్‌ దాడుల్లో 158 మంది పట్టుబడ్డారు. అర్ధరాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న 158 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సౌత్‌జోన్‌ డీసీపీ తెలిపారు. నగర వీధుల్లో రాత్రి వేళల్లో కొంతమంది యువకులు మద్యం తాగి హల్‌చల్ చేయడం, అమ్మాయిలను వేధించడం పరిపాటిగా మారింది. వివిధ కాలనీల నుంచి వస్తున్న పిర్యాదులను ఆధారం చేసుకుని పోలీసులు ఈ లేట్‌నైట్‌ రోమియోస్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ […]

Advertisement
Update: 2015-07-21 13:09 GMT
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో సౌత్‌జోన్ పోలీసులు మంగళవారం రాత్రి నిర్వహించిన ఆపరేషన్‌ లేట్‌నైట్‌ రోమియోస్‌ దాడుల్లో 158 మంది పట్టుబడ్డారు. అర్ధరాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న 158 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సౌత్‌జోన్‌ డీసీపీ తెలిపారు. నగర వీధుల్లో రాత్రి వేళల్లో కొంతమంది యువకులు మద్యం తాగి హల్‌చల్ చేయడం, అమ్మాయిలను వేధించడం పరిపాటిగా మారింది. వివిధ కాలనీల నుంచి వస్తున్న పిర్యాదులను ఆధారం చేసుకుని పోలీసులు ఈ లేట్‌నైట్‌ రోమియోస్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా వీరంతా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
Tags:    
Advertisement

Similar News