తెలంగాణ అభివృద్ధికి చేయూత: కేంద్ర మంత్రి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి హన్సలాల్ గంగారాం పేర్కొన్నారు. ఆదివారం గోదావరి పుష్కరాలకు నిజామాబాద్‌ జిల్లా బాసర వచ్చిన ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని రాష్ర్టాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలో నీటి కొరత కారణంగా బాసరకు నీటి విడుదలకు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర పరస్పరం సహకరించేందుకు కృషి చేస్తానన్నారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో అనేక పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ యువతకు ఉపాధి […]

Advertisement
Update: 2015-07-19 13:20 GMT
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి హన్సలాల్ గంగారాం పేర్కొన్నారు. ఆదివారం గోదావరి పుష్కరాలకు నిజామాబాద్‌ జిల్లా బాసర వచ్చిన ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని రాష్ర్టాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలో నీటి కొరత కారణంగా బాసరకు నీటి విడుదలకు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర పరస్పరం సహకరించేందుకు కృషి చేస్తానన్నారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో అనేక పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్‌తో రైతులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. 50 కిలోల యూరియా బస్తా ధర పెరగకుండా రూ.268కే అందిస్తామన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Tags:    
Advertisement

Similar News