పోలీసులకు చిక్కిన యూపీ మాఫియా డాన్‌ కొడుకు

ఉత్తరప్రదేశ్‌ మాజీ హోంమంత్రి, మాఫియాడాన్‌ అమరమణి త్రిపాఠీ కుమారుడు అనుమణి త్రిపాఠీని పోలీసుల‌కు చిక్కాడు. ఓ కేసులో ఇత‌ను చాలాకాలం నుంచి త‌ప్పించుకు తిరుగుతున్నాడు. భార్య సారాతో కలిసి ఢిల్లీ వెళుతున్నఆయన కారు ఫిరోజాబాద్‌ వద్ద  ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సారా (23) అక్కడికక్కడే మరణించింది. ప్రమాదవార్త తెలిసి అక్కడకు వెళ్ళిన‌ పోలీసులకు అనుమ‌ణి తార‌స‌ప‌డ్డాడు. వారిని చూసి అక్కడ నుంచి పారిపోతున్న అనుమణిని అరెస్ట్‌ చేశారు. లక్నోలో ఆయనపై  నమోదైన రౌడీయిజం కేసులో అనుమణిని […]

Advertisement
Update: 2015-07-10 13:11 GMT
ఉత్తరప్రదేశ్‌ మాజీ హోంమంత్రి, మాఫియాడాన్‌ అమరమణి త్రిపాఠీ కుమారుడు అనుమణి త్రిపాఠీని పోలీసుల‌కు చిక్కాడు. ఓ కేసులో ఇత‌ను చాలాకాలం నుంచి త‌ప్పించుకు తిరుగుతున్నాడు. భార్య సారాతో కలిసి ఢిల్లీ వెళుతున్నఆయన కారు ఫిరోజాబాద్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సారా (23) అక్కడికక్కడే మరణించింది. ప్రమాదవార్త తెలిసి అక్కడకు వెళ్ళిన‌ పోలీసులకు అనుమ‌ణి తార‌స‌ప‌డ్డాడు. వారిని చూసి అక్కడ నుంచి పారిపోతున్న అనుమణిని అరెస్ట్‌ చేశారు. లక్నోలో ఆయనపై నమోదైన రౌడీయిజం కేసులో అనుమణిని అరెస్ట్ చేసిన‌ట్లు ఎస్పీ పీయూష్‌ శ్రీవాత్సవ తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం సారా, అనుమణిలు ఆర్యసమాజ్‌ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. సారా తల్లి కాంగ్రెస్‌ నేత అని, తండ్రి అడ్వకేట్‌. అని, ఆయ‌న‌ యుపీ ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శిగా కూడా పని చేశారని ఎస్పీ తెలిపారు.
Tags:    
Advertisement

Similar News