‍మంత్రి తలసానికి పదవీ గండం!

వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ మంత్రి ప‌ద‌వికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తారా? మంత్రి పదవి నుండి తొలగిస్తారా? అనేది ప్రభుత్వం తేల్చుకోవలసిన సమయం వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తే గవర్నర్‌ నరసింహన్ స్వయంగా ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆయన రాజీనామాపై స్పీకర్ తక్షణం నిర్ణయం ప్రకటించకపోతే నేరుగా గవర్నర్‌ జోక్యం చేసుకుని బర్తరఫ్‌ చేసే […]

Advertisement
Update: 2015-07-11 02:11 GMT

వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ మంత్రి ప‌ద‌వికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తారా? మంత్రి పదవి నుండి తొలగిస్తారా? అనేది ప్రభుత్వం తేల్చుకోవలసిన సమయం వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తే గవర్నర్‌ నరసింహన్ స్వయంగా ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆయన రాజీనామాపై స్పీకర్ తక్షణం నిర్ణయం ప్రకటించకపోతే నేరుగా గవర్నర్‌ జోక్యం చేసుకుని బర్తరఫ్‌ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తలసాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న విషయాన్ని ఇటీవల రాష్ట్రపతి దృష్టికి టీడీపీ తీసుకువెళ్ళింది. ఇది తెలిసి ఆయన ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. మొత్తం పార్టీ ఫిరాయింపులపై ఆరా తీశారు. పార్టీ పిరాయింపుదారుల్లో తలసాని కేసు కొంచెం డిఫరెంట్‌గా ఉండడం గమనించారు. రాష్ట్ర పర్యటన ముగించుకుని వెళ్ళిన రాష్ట్రపతి హస్తిన నుంచి గవర్నర్‌ను దీనిపై వాకబు చేశారు. అలాగే రాష్ట్రపతి ఈ విషయాన్ని హోంశాఖ దృష్టికి కూడా తీసుకెళ్ళారని తెలిసింది. ఈ రెండు శాఖల కార్యాలయాల నుంచి గవర్నర్‌ను వివరణ అడగడంతో నరసింహన్‌ దీనిపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ విషయమై తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ కార్యాలయం సంప్రదించి ఆయన రాజీనామా ఆమోదించక పోవడానికి కారణాలను అడిగినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే పదవికి తలసాని చేసిన రాజీనామాను ఆమోదించి మంత్రిగా కొనసాగించడంపై సహేతుకతను కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత తలసానిని మళ్ళీ సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్‌లో విడిదిలో ఉన్నప్పుడే ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి తలసాని విషయంలో గవర్నర్‌పై ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టీఆర్‌ఎస్‌ మంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేయిస్తారని, రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వహించడంలో గవర్నర్‌ విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయనను బర్తరఫ్‌ చేయాలని డిమాండు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్‌ పాత్ర, స్పీకర్‌ పాత్ర ప్రశ్నార్ధకమైంది. రాష్ట్రపతి, హోంశాఖ నుంచి వివరణ కోరడం, వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో ఇక గవర్నర్‌ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో ఇపుడు తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంత్రిగా కొనసాగుతారా? లేక మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికయ్యే వరకు మంత్రి పదవి కోసం వేచి ఉంటారా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News