లక్ష సీసీ కెమెరాలతో హైదరాబాద్‌పై డేగ కన్ను!

త్వరలో లక్ష కెమెరాల మోహరింపుతో హైదరాబాద్‌పై నిఘా ఉంటుందని, నేరస్థులు తప్పించుకునే అవకాశం లేకుండా భద్రతా ఏర్పాట్లను చేపడతామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతీ కీలకమైన ప్రాంతంలోనూ పోలీసు ఉన్నా లేకపోయినా కెమెరా కన్ను మాత్రం ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కడైతే భద్రతా లోపాలు తరచూ సంభవిస్తున్నాయో అక్కడ పోలీసులతోపాటు సీసీ కెమెరాలు కూడా కాపు కాస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థ బాగా ఆధునీకీకరణ జరిగిందని, […]

Advertisement
Update: 2015-07-07 06:06 GMT
త్వరలో లక్ష కెమెరాల మోహరింపుతో హైదరాబాద్‌పై నిఘా ఉంటుందని, నేరస్థులు తప్పించుకునే అవకాశం లేకుండా భద్రతా ఏర్పాట్లను చేపడతామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతీ కీలకమైన ప్రాంతంలోనూ పోలీసు ఉన్నా లేకపోయినా కెమెరా కన్ను మాత్రం ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కడైతే భద్రతా లోపాలు తరచూ సంభవిస్తున్నాయో అక్కడ పోలీసులతోపాటు సీసీ కెమెరాలు కూడా కాపు కాస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థ బాగా ఆధునీకీకరణ జరిగిందని, సీసీ కెమెరాలతో ఇది మరింత ద్విగుణీకృతమవుతుందని కమిషనర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ నగరంలో ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే సంవత్సర కాలంలో నగరంలో లక్ష కెమెరాలతో నిఘా సాగుతుందని ఆయన చెప్పారు. సీసీ కెమెరాల నిర్వహణపై కానిస్టేబుళ్ళకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్‌ కూడళ్ళు, కొన్ని ముఖ్యమైన కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని మహేందర్‌రెడ్డి తెలిపారు. వీటి నిర్వహణ, డేటా విశ్లేషణ చేయడానికి ఇంజినీరింగ్‌ చదివి కానిస్టేబుళ్ళుగా పని చేస్తున్న 28 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామని తెలిపారు. డేటా విశ్లేషణ చేయడమే కాదు కమాండ్‌ కంట్రోల్‌కు కూడా వారు సమాచారం అందజేస్తారని ఆయన తెలిపారు. వీరు సరిపోరని, మరికొంతమంది కానిస్టేబుళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని కమిషనర్‌ తెలిపారు.
Tags:    
Advertisement

Similar News