ఎన్టీఆర్ కు షాకిచ్చిన జగపతిబాబు

హీరో కాదు.. కానీ అంతకంటే కాస్త ఎక్కువే స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు జగపతిబాబు. హీరోగా కంటేనే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయాడు. ఎక్కువ సంపాదిస్తున్నాడు కూడా. ఈ బలమే ఇప్పుడు జగపతిబాబును మరింత ఎగ్రెసివ్ గా తయారుచేసింది. తాజాగా ఈ సీనియర్ హీరో చేసిన ఓ కామెంట్ నందమూరి అభిమానులకు కోపం తెప్పిస్తోంది.                       టెంపర్ సినిమాకు […]

Advertisement
Update: 2015-06-25 23:37 GMT
హీరో కాదు.. కానీ అంతకంటే కాస్త ఎక్కువే స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు జగపతిబాబు. హీరోగా కంటేనే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయాడు. ఎక్కువ సంపాదిస్తున్నాడు కూడా. ఈ బలమే ఇప్పుడు జగపతిబాబును మరింత ఎగ్రెసివ్ గా తయారుచేసింది. తాజాగా ఈ సీనియర్ హీరో చేసిన ఓ కామెంట్ నందమూరి అభిమానులకు కోపం తెప్పిస్తోంది.
టెంపర్ సినిమాకు సంబంధించి కామెంట్స్ చేశాడు జగపతిబాబు. ఆ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన పాత్ర కోసం జగపతిబాబును కూడా సంప్రదించారు. కానీ జగపతిబాబు ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో పోసానితోనే సినిమా లాగించేశారు. నిజానికి పోసానికి ఆ పాత్ర మంచి పేరు కూడా తీసుకొచ్చింది. కామెడీ విలన్ గా చలామణి అవుతున్న పోసాని, టెంపర్ క్యారెక్టర్ తో సీరియస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయాడు. అయితే పోసాని చేసిన పాత్రను తను చేసుంటే.. టెంపర్ వసూళ్లు మరో 8కోట్ల రూపాయల వరకు పెరిగేవని కామెంట్ చేశాడు జగపతిబాబు. తను నటించలేదు కాబట్టే టెంపర్ కలెక్షన్లు తగ్గాయనే అర్థం వచ్చేలై మాట్లాడాడు. ఎన్టీఆర్ స్టామినాను కించపరిచేలా మాట్లాడిన జగపతిబాబుపై నందమూరి ఫ్యాన్స్ అంతా గుర్రుగా ఉన్నారు.
Tags:    
Advertisement

Similar News