బాలుకు హ‌రివ‌రాస‌నం అవార్డు 

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యానికి కేర‌ళ ప్ర‌భుత్వం హ‌రివ‌రాస‌నం అవార్డును ప్ర‌దానం చేసింది. శ‌బ‌రిమ‌ల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వీఎస్ శివ‌కుమార్ ఈ అవార్డును బాలుకు అంద‌చేశారు. శ‌బ‌రిమ‌ల ఆల‌య లౌకిక‌, విశ్వ‌జ‌నీన సోద‌ర భావాల‌ను త‌న పాట‌ల‌తో  ప్ర‌చారం చేసినందుకుగాను బాలును కేర‌ళ ప్ర‌భుత్వం రూ. ల‌క్ష న‌గ‌దు, ప్రశంసాప‌త్రంతో పాటు అవార్డును అంద‌చేశారు. గ‌త 50 ఏళ్లుగా ఎన్నో అవార్డులు అందుకున్నా ఈ అవార్డును అత్యంత ముఖ్య‌మైన‌దిగా భావిస్తాన‌ని బాలు […]

Advertisement
Update: 2015-06-20 13:13 GMT
ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యానికి కేర‌ళ ప్ర‌భుత్వం హ‌రివ‌రాస‌నం అవార్డును ప్ర‌దానం చేసింది. శ‌బ‌రిమ‌ల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వీఎస్ శివ‌కుమార్ ఈ అవార్డును బాలుకు అంద‌చేశారు. శ‌బ‌రిమ‌ల ఆల‌య లౌకిక‌, విశ్వ‌జ‌నీన సోద‌ర భావాల‌ను త‌న పాట‌ల‌తో ప్ర‌చారం చేసినందుకుగాను బాలును కేర‌ళ ప్ర‌భుత్వం రూ. ల‌క్ష న‌గ‌దు, ప్రశంసాప‌త్రంతో పాటు అవార్డును అంద‌చేశారు. గ‌త 50 ఏళ్లుగా ఎన్నో అవార్డులు అందుకున్నా ఈ అవార్డును అత్యంత ముఖ్య‌మైన‌దిగా భావిస్తాన‌ని బాలు అన్నారు.
Tags:    
Advertisement

Similar News