ప్లాను మార్చాలా.. ఇల్లు మార్చాలా...
సందిగ్థంలో చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కడతామంటే ఎవరైనా అనుమతిస్తారా..? అందులోనూ తెల్లారి లేస్తే ఎన్నో సుద్దపూస కబుర్లు చెప్పే చంద్రబాబునాయుడు ఇల్లు ఎలా బడితే అలా కట్టుకుంటాననడమేమిటి? నిబంధనలకు అనుగుణంగా లేదు కాబట్టే చంద్రబాబు ఇల్లుకు అనుమతులు రావడం లేదట. అందుకే ఆయన ఇపుడు డైలమాలో పడ్డారని, ఇంటి ప్లాను మార్చాలా లేక ఇల్లే వేరే చోట కట్టించాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం అక్కడ 10 మీటర్ల ఎత్తుకు మించి భవన […]
Advertisement
సందిగ్థంలో చంద్రబాబు
నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కడతామంటే ఎవరైనా అనుమతిస్తారా..? అందులోనూ తెల్లారి లేస్తే ఎన్నో సుద్దపూస కబుర్లు చెప్పే చంద్రబాబునాయుడు ఇల్లు ఎలా బడితే అలా కట్టుకుంటాననడమేమిటి? నిబంధనలకు అనుగుణంగా లేదు కాబట్టే చంద్రబాబు ఇల్లుకు అనుమతులు రావడం లేదట. అందుకే ఆయన ఇపుడు డైలమాలో పడ్డారని, ఇంటి ప్లాను మార్చాలా లేక ఇల్లే వేరే చోట కట్టించాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం అక్కడ 10 మీటర్ల ఎత్తుకు మించి భవన నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదు. చంద్రబాబు 13 మీటర్ల ఎత్తు వరకు ప్లాన్ లో చూపించడంతో అనుమతులు ఆగిపోయాయి. అసలే సందర్శకుల తాకిడి కారణంగా సరిపోవడం లేదని పాత ఇల్లు కూలగొట్టిస్తే మరలా కొత్త ఇల్లు కూడా ఇరుకుగా కట్టుకోవలసి రావడమేమిటి అని చంద్రబాబు తెగ చీకాకు పడిపోతున్నారట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపుతోనే తమ నాయకుడు చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతులివ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపిస్తుండడంతో జీహెచ్ ఎంసీ అధికారులు స్పందించారు. చంద్రబాబు చేసిన దరఖాస్తులో లేఔట్ డైమెన్షన్లు, భవనం ఎత్తు, సెట్‌బ్యాక్ నిబంధనలలో అతిక్రమణలు ఉన్నందువల్లే అనుమతులు ఇవ్వడం లేదని వారు వెల్లడించారు. భవన నిర్మాణ ప్లాన్‌ను సరిచేసి మరలా దరఖాస్తు చేసుకోవాలని తిప్పి పంపారు.
Advertisement