హోంగార్డు దరఖాస్తుకు అర్హత ఏడో తరగతే

హోంగార్డులకు దరఖాస్తు చేస్తే అభ్యర్థులకు కనీస విద్యార్హత 7వ తరగతి ఉత్తీర్ణతగాని, అందుకు సమానమైన అర్హత ఉండాలి. అధిక విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులకు కెమికల్ ల్యాబ్‌, ఫొర్సెనిక్‌ విభాగంలో విజ్ఞానం ఉండాలి. మెడికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలి. పురుషులు 155 సెం.మీ, మహిళలు 150 సెం.మీ కనీస ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సెం.మీ సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును ఈ నెల17 వ తేదీ నుంచి […]

Advertisement
Update: 2015-06-15 13:06 GMT
హోంగార్డులకు దరఖాస్తు చేస్తే అభ్యర్థులకు కనీస విద్యార్హత 7వ తరగతి ఉత్తీర్ణతగాని, అందుకు సమానమైన అర్హత ఉండాలి. అధిక విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులకు కెమికల్ ల్యాబ్‌, ఫొర్సెనిక్‌ విభాగంలో విజ్ఞానం ఉండాలి. మెడికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలి. పురుషులు 155 సెం.మీ, మహిళలు 150 సెం.మీ కనీస ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సెం.మీ సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును ఈ నెల17 వ తేదీ నుంచి 19 వతేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు గోషామహల్‌ పోలీస్ స్టేడియంలో ఇవ్వాలి. అదే రోజు హాల్‌టిక్కెట్‌, గుర్తింపు కార్డు ఇస్తారు. దరఖాస్తుతోపాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు కోసం రూ.25ల డీడీని గాని, చెక్కును గాని, పోస్టల్‌ ఆర్డర్‌గాని చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంది. కెమికల్‌ ల్యాబ్‌ ఫొర్సెనిక్‌ టూల్‌ విభాగాల్లో అభ్యర్థులకు ఉన్న అనుభవాన్ని బట్టి మార్కులు ఉంటాయి. టెక్నికల్‌ కమిటీ ఈనెల 22 వతేదీ 24 వ తేదీ వరకు సమావేశమై అభ్యర్థులకు మార్కులను నిర్ణయిస్తుంది.
Tags:    
Advertisement

Similar News