గ‌వ‌ర్న‌ర్‌జీ...త‌ల‌సాని రాజీనామా చేశారా లేదా?: మ‌ర్రి 

టీడీపీలో ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పని చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో? లేదో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్పీకర్ మధుసూధనాచారికి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేఖ రాశారు.  తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని స్పీకర్ ను శశిధర్ రెడ్డి కోరారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసి ఉంటే దానిని ఎందుకు ఆమోదించటం […]

Advertisement
Update: 2015-06-14 13:47 GMT
టీడీపీలో ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పని చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో? లేదో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్పీకర్ మధుసూధనాచారికి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేఖ రాశారు. తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని స్పీకర్ ను శశిధర్ రెడ్డి కోరారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసి ఉంటే దానిని ఎందుకు ఆమోదించటం లేదో, రాజీనామా చేయ‌కుంటే ఆయ‌న మంత్రిగా ఎలా కొన‌సాగుతున్నారో తెలపాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్‌గా పదవిలో కొనసాగకూడదన్నారు.
Tags:    
Advertisement

Similar News