చంద్రబాబుతో గవర్నర్ సలహాదారుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గవర్నర్ సలహాదారులు సమావేశమయ్యారు. అంతకుముందు పోలీసు ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన మరుక్షణమే గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ సలహాదారులు చంద్రబాబుతో సమావేశం కావడం అందరిలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే, వీరు చంద్రబాబు ఆహ్వానం మేరకు భేటీ అయ్యారా.. లేక గవర్నర్ పంపించారా అనే విషయం స్పష్టం కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ భేటీ జరిగింది. అంతకుముందే గవర్నర్ ఏకపక్షంగా […]

Advertisement
Update: 2015-06-14 13:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గవర్నర్ సలహాదారులు సమావేశమయ్యారు. అంతకుముందు పోలీసు ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన మరుక్షణమే గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ సలహాదారులు చంద్రబాబుతో సమావేశం కావడం అందరిలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే, వీరు చంద్రబాబు ఆహ్వానం మేరకు భేటీ అయ్యారా.. లేక గవర్నర్ పంపించారా అనే విషయం స్పష్టం కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ భేటీ జరిగింది. అంతకుముందే గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సర్కార్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఆయన నోరు మెదపడం లేదని టీడీపీ నేతలు నేరుగా గవర్నర్ ను విమర్శిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. విభజన చట్టానికి సంబంధించిన సెక్షన్ 8 అంశాన్ని కూడా గవర్నర్ సలహాదారులు చంద్రబాబునాయుడితో చర్చించినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News