9 నుంచి కాంగ్రెస్ యుద్ధ‌భేరి: ర‌ఘువీరా

‘‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశాయి. ఎన్నికల వాగ్దానాలు అమలుచేయలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలుచేయలేదు. ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు. వారికి మరో అవకాశం ఇస్తున్నాం. ఈనెల 8న టీడీపీ ప్రభుత్వం గుంటూరులో నిర్వహించే ఏడాది పాలన సభలో సీఎం చంద్రబాబు వీటన్నిటిపైనా నిర్ణీత తేదీలతో స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే 9న యుద్ధభేరి మోగించడానికి మాతో కలిసి రావాలి. ఆ రోజు నుంచి కోటి మందితో రణభేరి మోగించి రోడ్డెక్కుతాం. […]

Advertisement
Update: 2015-06-06 20:36 GMT

‘‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశాయి. ఎన్నికల వాగ్దానాలు అమలుచేయలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలుచేయలేదు. ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు. వారికి మరో అవకాశం ఇస్తున్నాం. ఈనెల 8న టీడీపీ ప్రభుత్వం గుంటూరులో నిర్వహించే ఏడాది పాలన సభలో సీఎం చంద్రబాబు వీటన్నిటిపైనా నిర్ణీత తేదీలతో స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే 9న యుద్ధభేరి మోగించడానికి మాతో కలిసి రావాలి. ఆ రోజు నుంచి కోటి మందితో రణభేరి మోగించి రోడ్డెక్కుతాం. మీ బండారం బయటపెడతాం. నిజస్వరూపాన్ని ఎండగడతాం. మీరు ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేని పరిస్థితిని కల్పిస్తాం’’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి అల్టిమేటం జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన రణభేరి సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల ప్రథమ వార్షికోత్సవాల నేపథ్యంలో ఈ ఏడాదిలో ఏంజరిగిందో ప్రజల్లో చర్చ పెట్టడానికి తమ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News