తెలుగు రాష్ట్రాలకు గడ్కరీ వరాలు

తెలంగాణ రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఏపీలో 20 వేల కోట్లతో భారీ ప్రాజెక్టులను చేపట్టబోతున్నటు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలకు కేంద్రం పూర్తి స్థాయిలో సహాయసహకారాలను అందిస్తుందని స్పష్టం చేశారు. వీడియో లింకేజీ ద్వారా ముంబై నుంచి దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి […]

Advertisement
Update: 2015-06-03 13:38 GMT

తెలంగాణ రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఏపీలో 20 వేల కోట్లతో భారీ ప్రాజెక్టులను చేపట్టబోతున్నటు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలకు కేంద్రం పూర్తి స్థాయిలో సహాయసహకారాలను అందిస్తుందని స్పష్టం చేశారు. వీడియో లింకేజీ ద్వారా ముంబై నుంచి దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రూపుదిద్దుకోనున్న రాజధానితోపాటు అమరావతిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించేందుకు అవసరమైన జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబుతో ఇప్పటికే చర్చించినట్లు గడ్కరీ చెప్పారు. ఆయా నిర్మాణాలకుగాను కేంద్రం నుంచి తగిన సహకారముంటుందని ఏపీ సర్కారుకు చెప్పామన్నారు.

Tags:    
Advertisement

Similar News