మోడీ సర్కార్‌ ఐదేళ్ల వరకు ఉండదు: రాహుల్‌

ఏదో ఒక కారణంతో మోదీ సర్కారు భూసేకరణ బిల్లును ఆదరాబాదరాగా పార్లమెంట్‌లో ఆమోదింపచేయాలని చూస్తోందని, ఇదే విధానాలతో ముందుకు సాగితే ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. కోజికోడ్‌ బీచ్‌లో ఆయన ప్రసంగించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని మోడీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారనీ, కానీ అధికారంలోకి వచ్చాక అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. తొలి ఏడాది పూర్తి చేసుకున్న ‘‘సూటు బూటు సర్కార్‌’’కు త‌న […]

Advertisement
Update: 2015-05-26 13:12 GMT
ఏదో ఒక కారణంతో మోదీ సర్కారు భూసేకరణ బిల్లును ఆదరాబాదరాగా పార్లమెంట్‌లో ఆమోదింపచేయాలని చూస్తోందని, ఇదే విధానాలతో ముందుకు సాగితే ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. కోజికోడ్‌ బీచ్‌లో ఆయన ప్రసంగించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని మోడీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారనీ, కానీ అధికారంలోకి వచ్చాక అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. తొలి ఏడాది పూర్తి చేసుకున్న ‘‘సూటు బూటు సర్కార్‌’’కు త‌న శుభాకాంక్షలని వ్యంగ్యంగా అన్నారు.
Tags:    
Advertisement

Similar News