జూన్‌లో జగన్‌ సమర దీక్ష

జూన్‌ 3,4 తేదీలలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జగన్‌ సమరదీక్ష నిర్వహించనున్నారు. శ‌నివారం ఉదయం విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపిటిసి, జడ్‌పిటిసిల సమావేశంలో ఆపార్టీ ప్రధానకార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇంత వరకు ఒక్కఎన్నికల హామీనీ నెరవేర్చనందుకు నిరసనగా జగన్‌ ఈ దీక్షకు పూనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, యువకులకు నిరుద్యోగ […]

Advertisement
Update: 2015-05-23 03:50 GMT

జూన్‌ 3,4 తేదీలలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జగన్‌ సమరదీక్ష నిర్వహించనున్నారు.

శ‌నివారం ఉదయం విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపిటిసి, జడ్‌పిటిసిల సమావేశంలో ఆపార్టీ ప్రధానకార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇంత వరకు ఒక్కఎన్నికల హామీనీ నెరవేర్చనందుకు నిరసనగా జగన్‌ ఈ దీక్షకు పూనుకుంటున్నారని చెప్పారు.

ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, యువకులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఋణ మాఫీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తాం అని నోటికొచ్చిన అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.

ఏడాది పాలనలో బాబు వైఫల్యాలను సమరదీక్ష ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళతామని తెలిపారు.

ఈ సందర్భంగా వై.ఎస్‌.జగన్‌ తలపెట్టిన సమరదీక్ష పోస్టర్‌ని ఆవిష్కరించారు.

Tags:    
Advertisement

Similar News