వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలుపెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు. వీటిని పాటిస్తే వడదెబ్బకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. రోజూ వీలైనంత మేర పండ్ల రసాలు తాగిడం… నిమ్మరసం, పుచ్చకాయ, కీర వంటి చలువ చేసే జ్యూసులు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయని వారు తెలిపారు. పుదీనా, ద్రాక్ష, క్యారెట్‌ జ్యూస్‌లు కూడా ఒంటిలో ఉన్న వేడిని బాగా అదుపు చేస్తాయని, వడదెబ్బ బారిన పడకుండా […]

Advertisement
Update: 2015-05-23 01:24 GMT
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలుపెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు. వీటిని పాటిస్తే వడదెబ్బకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. రోజూ వీలైనంత మేర పండ్ల రసాలు తాగిడం… నిమ్మరసం, పుచ్చకాయ, కీర వంటి చలువ చేసే జ్యూసులు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయని వారు తెలిపారు. పుదీనా, ద్రాక్ష, క్యారెట్‌ జ్యూస్‌లు కూడా ఒంటిలో ఉన్న వేడిని బాగా అదుపు
చేస్తాయని, వడదెబ్బ బారిన పడకుండా కాపాడతాయని చెప్పారు. జ్యూసుల్లో కూడా సాధ్యమైనంత తక్కువగా ఐస్‌ వాడాలని, ఐస్‌ ఎక్కువగా వాడితే లేనిపోని సమస్యలు వస్తాయని హెచ్చరించారు. వేడిగా ఉన్న రోజుల్లో తప్పనిసరిగా గొడుగువాడాలి, నెత్తిన టోపీ లేదా రుమాలు పెట్టుకుని ఉంటే కొంత ఉపశమనం కలుగుతుంది. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్‌ కలిపిన నీరు తాగవచ్చని, లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం తాగవచ్చని చెప్పారు. వడదెబ్బకు గురైనవారిని తడిగుడ్డతో శరీరమంతా రుద్దుతూ ఉండాలని, ఐస్‌ నీటిలో బట్టను ముంచి శరీరమంతా
తుడవాలని చెప్పారు. మంచినీరు రోజూ కనీసం నాలుగైదు లీటర్లు తాగుతూ ఉంటే చాలా మంచిదని ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగడం మరిచిపోవద్దని సూచించారు. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరుగుట తదితర అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించి ప్రాథమిక చికిత్స తీసుకోవాలని సూచించారు. సూర్య కిరణాలు, వేడిగాలికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని, వేసవిలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించడం మానుకోవాలని వారు సూచించారు. మధ్యాహ్నం
తర్వాత (ఉదయం 10 గం. నుంచి సా. 4 గం. మధ్యకాలంలో) ఆరు బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉంటే మంచిదని తెలిపారు. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు తినడం, తేనె తీసుకోవడం అసలు చేయకూడదని సూచించారు. శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా బయటి నుంచి వచ్చిన వెంటనే ఐస్‌ వాటర్‌ తాగవద్దని హెచ్చరించారు.
Tags:    
Advertisement

Similar News