రాజధానికి భూమి పూజకు స్థ‌ల నిర్ణ‌యం!

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూమిపూజ వేదికను దాదాపుగా నిర్ణయించారు. తుళ్లూరు మండలం మందడం శివారు తాళ్లాయపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ ఆరో తేదీన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ అధికారులు, వాస్తు సిద్ధాంతుల బృందం సంయుక్తంగా శంకుస్థాపనకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించింది. మొత్తం రాజధాని ప్రాంతానికి ఈశాన్యం శ్రీశైవ క్షేత్రమనే పుణ్యస్థలి… కృష్ణాతీర ప్రాంతమై ఉండడాన్ని […]

Advertisement
Update: 2015-05-21 22:40 GMT
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూమిపూజ వేదికను దాదాపుగా నిర్ణయించారు. తుళ్లూరు మండలం మందడం శివారు తాళ్లాయపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ ఆరో తేదీన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ అధికారులు, వాస్తు సిద్ధాంతుల బృందం సంయుక్తంగా శంకుస్థాపనకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించింది. మొత్తం రాజధాని ప్రాంతానికి ఈశాన్యం శ్రీశైవ క్షేత్రమనే పుణ్యస్థలి… కృష్ణాతీర ప్రాంతమై ఉండడాన్ని ఈ బృందం అనుకూల అంశాలుగా నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు భూసమీకరణ కింద భూములను ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బృందం తాళ్లాయపాలెమే శంకుస్థాపనకు అనుకూలమైందని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది.
Tags:    
Advertisement

Similar News