వర్షం నీటిని ఒడిచి ప‌ట్టండి: చంద్రబాబు

వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. శ్రీ కృష్ణ దేవరాయులు ఎన్నో చెరువులను తవ్వించినందువల్లనే  ఆయన్ను ఇప్పటికీ గుర్తుంచుకున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం భూగర్భ జలమట్టం పడిపోయింది, దాంతో బోర్లు వేసి రైతులు అప్పులపాలవుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల ప్రజలు వర్షం నీటిని సంరక్షించుకోవాలని, వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని ఆయన కోరారు. నదుల అనుసంధానంతో కరువును తరిమికొడదామని సీఎం అన్నారు. రాయలసీమ నేలలు పండ్లతోటలు, మెట్టపైర్లకు అనుకూలమని, రైతులు […]

Advertisement
Update: 2015-05-12 20:32 GMT
వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. శ్రీ కృష్ణ దేవరాయులు ఎన్నో చెరువులను తవ్వించినందువల్లనే ఆయన్ను ఇప్పటికీ గుర్తుంచుకున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం భూగర్భ జలమట్టం పడిపోయింది, దాంతో బోర్లు వేసి రైతులు అప్పులపాలవుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల ప్రజలు వర్షం నీటిని సంరక్షించుకోవాలని, వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని ఆయన కోరారు. నదుల అనుసంధానంతో కరువును తరిమికొడదామని సీఎం అన్నారు. రాయలసీమ నేలలు పండ్లతోటలు, మెట్టపైర్లకు అనుకూలమని, రైతులు బిందు, తుంపర సేద్యానికి ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. పేదలకు ఉచితంగా వంట గ్యాస్‌ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Tags:    
Advertisement

Similar News