శోభా నాగిరెడ్డికి ఘన నివాళి

హైదరాబాద్‌ వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర‌ ఆఫీసులో శుక్రవారం ఉదయం శోభా నాగిరెడ్డి ప్రధమ వర్థంతి సభ జరిగింది. ఆమె చిత్రపటానికి పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల‌ రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, రాఘవరెడ్డి, విజయచందర్‌, ముస్తాఫా అహమ్మద్‌, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ శోభమ్మ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం అన్నారు. ఆమె లేని లోటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు తీరని లోటని, ఆమె బ్రతికి ఉంటే ఈనాటి […]

Advertisement
Update: 2015-04-24 03:45 GMT

హైదరాబాద్‌ వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర‌ ఆఫీసులో శుక్రవారం ఉదయం శోభా నాగిరెడ్డి ప్రధమ వర్థంతి సభ జరిగింది. ఆమె చిత్రపటానికి పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల‌ రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, రాఘవరెడ్డి, విజయచందర్‌, ముస్తాఫా అహమ్మద్‌, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ శోభమ్మ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం అన్నారు. ఆమె లేని లోటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు తీరని లోటని, ఆమె బ్రతికి ఉంటే ఈనాటి శాసన సభలో ఆమె పాత్ర కీలకంగా ఉండేదని చెప్పారు.
ఫ్యాక్షన్‌ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె శాంతియుత థోరణిలో ఒక సమర్ధ నేతగా అంచలంచలుగా ఎదిగారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఆప్యాయంగా, ఆత్మీయంగా శోభమ్మ, శోభక్క అని పిలుచుకునే ఆమె ఒక ధైర్య శాలి అయిన మహిళా నేత అని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News