ఏపీ ఎడ్‌సెట్‌కు స్పందన కరువు

హైదరాబాద్ : ఏపీ ఎడ్‌సెట్‌-2015కు అభ్యర్థుల నుంచి నామమాత్రపు స్పందనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 376 బీఈడీ కాలేజీల్లో 40 వేల సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఇప్పటివరకూ కేవలం 19 వేల దరఖాస్తులే అందాయి. బుధవారంతో దరఖాస్తుల దాఖలుకు గడువు ముగుస్తున్నా అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఎడ్‌సెట్‌ వర్గాలు కంగుతిన్నాయి. దీంతో గడువును ఈనెల 28 వరకూ పొడిగించారు. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో 65 వేల సీట్లకు దాదాపు 1.70 లక్షల […]

Advertisement
Update: 2015-04-23 03:52 GMT
హైదరాబాద్ : ఏపీ ఎడ్‌సెట్‌-2015కు అభ్యర్థుల నుంచి నామమాత్రపు స్పందనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 376 బీఈడీ కాలేజీల్లో 40 వేల సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఇప్పటివరకూ కేవలం 19 వేల దరఖాస్తులే అందాయి. బుధవారంతో దరఖాస్తుల దాఖలుకు గడువు ముగుస్తున్నా అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఎడ్‌సెట్‌ వర్గాలు కంగుతిన్నాయి. దీంతో గడువును ఈనెల 28 వరకూ పొడిగించారు. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో 65 వేల సీట్లకు దాదాపు 1.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడానికి, బీఈడీ కోర్సు కాల వ్యవధిని రెండేళ్లకు పెంచడమే కారణమని అధికారులు చెబుతున్నారు.
Advertisement

Similar News